Farmers Protest : రైతుల ఆందోళనతో ఖాకీలు అలర్ట్
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
Farmers Protest : దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, పేరుకు పోయిన నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది.
దీంతో ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. జంతర్ మంతర్ వద్ద రైతులు నిరసన(Farmers Protest) చేపట్టనున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించినట్లు ఢిల్లీ పోలీస్ చీఫ్ వెల్లడించారు.
వాయువ్య ఢిల్లీ, ఘాజీపూర్ సరిహద్దులో ఉన్న సింగు సరిహద్దు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఈరోజు వరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్(Rakesh Tikait).
దేశంలో 15 కోట్లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్ముకుంటూ వెళుతోందంటూ కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు రైతు నాయకుడు.
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వ్యవసాయ రంగం, నిరుద్యోగ రంగమేనని స్పష్టం చేశారు. దేశానికి చెందిన ప్రధాన వనరులన్నింటిని విధ్వంసం చేసి జనం చెవులులో పూలు పెడుతున్నారంటూ ప్రధాని మోదీపై(PM Modi) నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా యూపీలోని లఖింపూర్ ఖేరిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల పాటు ఆందోళన చేపట్టారు.
Also Read : న్యాయం జరగక పోతే నిరసన