Tirumala Brahmotsavam : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో వేద‌ఘోష‌

ధార్మిక ప్ర‌వ‌చ‌నాలు.. భక్తి సంగీత కార్యక్రమాలు

Tirumala Brahmotsavam : తిరుమ‌ల – శ్రీ‌వారి నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టీటీడీ(TTD) శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌ ఆధ్వ‌ర్యంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల నాద నీరాజనం వేదికపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tirumala Brahmotsavam Updates

బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం 5 నుడి 5.45 గంట‌ల వ‌ర‌కు వేద విద్యార్థులు చ‌తుర్వేదాల‌తో వేద‌ఘోష వినిపిస్తారు. ఉద‌యం 5.45 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు దేశంలోని ప్ర‌ముఖ‌ పండితుల‌తో వేద విజ్ఞానంపై స‌ద‌స్సు చేప‌డ‌తారు.

చిర్రావూరి శ్రీరామశర్మ, వేదాంత విశారద వెంపటి కుటుంబ శాస్త్రి, డాక్టర్ అల్లాడి మోహన్, ఆచార్య చక్రవర్తి రంగనాథన్, రాణి సదా శివ మూర్తి, దేవనాథన్, కృష్ణమూర్తి వంటి వేద శాస్త్రజ్ఞులు వేదాల ప్రాముఖ్యత గురించి ప్ర‌వ‌చిస్తారు.

ప్రతి రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ప్రముఖ గాయకులు ఫ‌ణి నారాయ‌ణ‌, నేమని పార్థసారధి, డాక్టర్ మోహన్ కృష్ణ, శ్రీనిధి, పవన్‌కుమార్ చరణ్, ప్రొఫెసర్ శైలేశ్వరి, రాణి శ్రీనివాస శర్మ, వాసురావు, మొదుముడి సుధాకర్, రామా చారి తమ బృందాలతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమ‌న‌ కరుణాకరరెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొంటారు.

Also Read : Telangana Congress Slams : కేటీఆర్ కాదు లూటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!