Tirumala Break Darshan : 17న బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala Break Darshan : శ్రీవారి భక్తులకు కోలుకోలేని షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జూలై 17న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. సోమవారం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన గుడిలో సాలకట్ల అణీవార ఆస్థానం నిర్వహిస్తున్నామని అందుకని బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
దీని కారణంగా జూలై 16న ఆదివారం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించ బోమంటూ టీటీడీ(TTD) పేర్కొంది. ఈ విషయాన్ని సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు గమనించాలని కోరింది.
ఇదిలా ఉండగా వేసవి సెలవులు పూర్తయినా భక్తుల తాకిడి మాత్రం అలాగే ఉంది. భారీ ఎత్తున భక్త బాంధవులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మల దర్శనం కోసం తరలి వస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నానా తంటాలు పడుతోంది. ప్రత్యేకించి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.
Also Read : Political Criminals Comment : పొలిటికల్ అనకొండల్ని ఆపలేమా