Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.70 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 55,312
Tirumala Hundi : తిరుమల – తిరుమలలో ఎప్పటి లాగే భక్తుల రద్దీ కొనసాగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తారు. అందుకే దేశ వ్యాప్తంగా భక్తులు స్వామి వారిని కొలుస్తారు. అంతే కాదు విదేశాలలో సైతం కోట్లాది మంది భక్త బాంధవులు శ్రీనివాసుడిని కొలుస్తారు.
Tirumala Hundi Updates
రోజు రోజుకు తిరుమలకు వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. చిన్నారులు, తల్లులు, వృద్దులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
ఇక ఎప్పటి లాగే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 66 వేల 312 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 2 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.70 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలలో డైరెక్టు లైన్ కొనసాగుతోంది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుడా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి కనీసం 7 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
Also Read : Scam Calls Alert : ఆ 10 ఫోన్ నెంబర్లు యమ డేంజర్