Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీనివాసుడు, అలివేలు మంగమ్మ కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులు రోజూ వారీగా సమర్పించే కానుకలు, విరాళాలు భారీగా అందుతున్నాయి స్వామి వారికి.
Tirumala Hundi Updates
స్వామి వారిని 62 వేల 269 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 255 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా సమర్పించే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.19 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) వెల్లడించింది.
తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం డైరెక్ట్ లైన్ కొనసాగుతోందని, ఇక ఎలాంటి టికెట్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 5 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీ(TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారిని ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుందని ప్రగాఢ నమ్మకం భక్తులకు. అందుకే కరోనా తర్వాత పెద్ద ఎత్తున కలియుగ దేవుడైన శ్రీ వేంకటేశ్వరుడి కరుణ కటాక్షం తమపై ఉండాలని భావిస్తున్నారు.
Also Read : Chandra Babu Bail Comment : బాబూ కండీషన్స్ అప్లై