Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు
దర్శించుకున్న భక్తులు 63,404
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రసాద వితరణతో పాటు దర్శన భాగ్యం త్వరితగతిన అయ్యేలా కృషి చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
Tirumala Hundi Updates
ఇక తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను 63 వేల 404 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 659 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజు రూ. 3.42 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా తిరుమల లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి సర్వ దర్శనం టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని ఈవో ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
Also Read : AP DIG Ravi Kiran : సెక్యూరిటీ సూపర్ బాబు సేఫ్