Tirumala : శ్రీవారి ఆదాయం రూ. 3.75 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 62,005
Tirumala : భక్తుల తాకిడి పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా ఆదాయం హుండీ రూపేణా సమకూరుతోంది. ఇప్పటికే లెక్కకు మించిన ఆభరణాలు, కానుకలు ఉన్నాయి. టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. రోజు రోజుకు తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా శ్రీవారి, అమ్మ వార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. చాలా మంది దర్శనం కోసం తిప్పలు పడ్డారు. గత ఆదివారం ఏకంగా 92 వేల మందికి పైగా ఆ దేవ దేవుడిని దర్శించు కోవడం విశేషం.
వేసవి సెలవులు పూర్తి కావడంతో మెల మెల్లగా భక్తులు తగ్గుతున్నారు. జూన్ 29న గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామిని, శ్రీ అలివేలు మంగమ్మలను 62 వేల 5 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారిని మొక్కుకున్న భక్తులు 34 వేల 127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక భక్తులు స్వామి వారికి సమర్పించుకున్న కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3. 75 కోట్లు సమకూరాయి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఆయా కంపార్ట్ మెంట్లలో భక్తులు సర్వ దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామి వారిని దర్శించు కునేందుకు సమయం కనీసం 24 గంటల పాటు పడుతుందని తెలిపింది టీటీడీ(TTD).
ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి.
Also Read : MP Sanjay Singh : మైనార్టీల పట్ల బీజేపీ వివక్ష