Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 59,304
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువైన తిరుమల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
స్వామి వారికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 59 వేల 304 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. 22 వేల 391 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు.
Tirumala Hundi Updates
భక్తులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాలు శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ. 4.08 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
భక్తులు తిరుమల కంపార్ట్ మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 2 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ ఈవో వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈనెల 15 నుంచి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 25 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
భారీ ఎత్తున భక్తులు ఉత్సవాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక భక్తుల భద్రతకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్లు ఈవో వెల్లడించారు.
Also Read : Modi Govt Comment : సోషల్ మీడియా పారా హుషార్