Tirumala Hundi : భక్త జన సందోహం భారీగా ఆదాయం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.90 కోట్లు
తిరుమలలో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. వేసవి సెలవులు ముగిసినా పుణ్య క్షేత్రానికి భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా శ్రీవారు, అమ్మ వార్లను దర్శించు కునేందుకు భక్తులు బారులు తీరారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. నిన్న ఒక్క రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను 76 వేల 254 మంది భక్తులు దర్శించుకున్నారు.
భక్తులు పుణ్య క్షేత్రాన్ని కొంగు బంగారంగా , కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా స్వామి వారిని కొలుస్తారు. అంతే కాదు ఎన్ని అప్పులున్నా ఆ కలియుగ వైకుంఠ నాథుడిని మొక్కుకుంటే బయట పడేస్తాడన్న నమ్మకం భక్తులకు ఉంది. ఎప్పటి లాగే స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28 వేల 91 గా ఉంది.
ఇక సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది టీటీడీ. ఇక భక్తులు పెద్ద ఎత్తున సమర్పించిన కానుకలు, విరాళాల రూపేణా భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఏకంగా స్వామి వారికి రూ. 4.90 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక సర్వ దర్శనం కోసం టోకెన్లు లేకుండా సుమారు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. మరో వైపు శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ దర్శనం కోసం 22 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
