Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.11 కోట్లు
స్వామిని దర్శించుకున్న 64,347 మంది భక్తులు
Tirumala Hundi : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొద్దిగా తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరగడం విశేషం. జూలై 10 సోమవారం శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను 64 వేల 347 భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 28 వేల 358 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం ఏకంగా రూ. 5.11 కోట్లు రావడం విస్తు పోయేలా చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలిని.
గత కొద్ది కాలం తర్వాత అత్యధికంగా ఆదాయం సమకూరడం ఇదే అతి పెద్దది కావడం విశేషం. శ్రీవారి దర్శనం కోసం తిరుమల లోని 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి, అమ్మ వారి దర్శనానికి కనీసం 20 గంటలకు పైగా పట్టనుందని టీటీడీ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన ప్రకటన చేసింది. ఇవాళ జూలై 11న బ్రేక్ దర్శనం సౌకర్యం ఉండదని స్పష్టం చేసింది. స్వామి వారికి తిరుమంజనం సేవ నిర్వహిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది టీటీడీ. దీంతో భక్తులకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబోమంటూ ప్రకటించింది. భక్తులు సహకరించాలని కోరింది.
Also Read : TSPSC SIT : టీఎస్పీఎస్సీ కేసులో సిట్ దూకుడు