Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌. శ్రీ‌నివాసుడు, అలివేలు మంగ‌మ్మ కొలువు తీరిన ఈ క్షేత్రానికి భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. స్వామి క‌రుణ క‌టాక్షం కోసం వేచి చూస్తున్నారు. ఆయ‌న చ‌ల్ల‌ని చూపు కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ మేర‌కు ఇత‌ర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది.

Tirumala Rush with Devotees

ఇందులో భాగంగా భ‌క్తుల ర‌ద్దీ మ‌రింత పెరిగింది. నిన్న ఒక్క రోజే భారీగా పెరిగారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ని 70 వేల 902 మంది ద‌ర్శించుకున్నారు. 22 వేల 858 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని 24 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. వారికి స్వామి వారి సేవ‌కులు సేవ‌లు అంద‌జేస్తున్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా ఉన్న భ‌క్త బాంధ‌వులకు ద‌ర్శ‌నం కోసం క‌నీసం 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

Also Read : Chandra Babu Cases-8: చంద్ర‌బాబుపై ఎనిమిది కేసులు

Leave A Reply

Your Email Id will not be published!