Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు

ద‌ర్శించుకున్న భ‌క్తులు 62,494

Tirumala Rush : తిరుమ‌ల – భ‌క్త బాంధ‌వుల తాకిడి కొన‌సాగుతూనే ఉంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రానికి. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌స్తున్నారు . భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) .

Tirumala Rush with Devotees

తిరుమ‌ల‌లో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. రోజు రోజుకు గ‌ణ‌నీయైన ఆదాయం స‌మ‌కూరుతోంది టీటీడీకి. స్వామి వారిని 62 వేల 494 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 27 వేల 666 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.

నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు స‌మ‌కూరింద‌ని టీటీడీ(TTD) కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు. ఇక ద‌ర్శ‌నానికి సంబంధించి భ‌క్త బాంధ‌వులు శిలాతోర‌ణం దాకా వేచి ఉన్నారు.

ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 24 గంట‌ల‌కు పైగా ప‌ట్ట‌నుంద‌ని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండ‌గా సామాన్య భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన ద‌ర్శ‌నం అయ్యేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

Also Read : Indian Air Force : ఫైన‌ల్ లో ఎయిర్ ఫోర్స్ ప్ర‌ద‌ర్శ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!