Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.28 కోట్లు
స్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం
Tirumala Rush : తిరుమల – ఏడాది చివరి నెల కావడంతో భక్తులతో పోటెత్తుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు ఈవో ఏవీ ధర్మా రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది, శ్రీవారి సేవకులు నిమగ్నమై ఉన్నారు.
Tirumala Rush with Devotees
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు బారులు తీరారు భక్త బాంధవులు. స్వామి వారిని 64 వేల 882 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 900 మంది భక్తులు తల నీలాలు సమర్పించారని టీటీడీ(TTD) వెల్లడించింది.
భక్త బాంధవులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.28 కోట్లు వచ్చిందని స్పష్టం చేశారు టీటీడీ కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి. మరో వైపు స్వామి వారి దర్శనం కోసం 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.
Also Read : Mansoor Ali Khan : మన్సూర్ కామెంట్స్ కోర్టు సీరియస్