Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 4.87 కోట్లు
దర్శించుకున్న భక్తులు 56,978
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన పుణ్య క్షేత్రం తిరుమల. రోజు రోజుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది తిరుమల తిరుపతి దేవస్థానంకు. టీటీడీ పాలక మండలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. శ్రీవారి సేవకులు చేస్తున్న సేవలను కొనియాడారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Tirumala Rush with Devotees
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 56 వేల 978 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 617 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. ఏకంగా టీటీడీకి రూ. 4.87 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని టీటీడీ(TTD) కార్య నిర్వాహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
తిరుమలలో భక్తులు డైరెక్ట్ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
Also Read : CM Siddaramaiah : కేసీఆర్ ధోకా కాంగ్రెస్ పక్కా