Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు

శ్రీ‌నివాసుడిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 74,268

Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. ఓ వైపు వ‌ర్షాలు దంచి కొడుతున్నా భ‌క్త బాంధ‌వులు లెక్క చేయ‌డం లేదు. గ‌త రెండు నెల‌లుగా భ‌క్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. బుధ‌వారం ఒక్క రోజు శ్రీ‌నివాసుడు, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌లను 74 వేల 268 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 26 వేల 817 మంది భ‌క్తులు స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

Tirumala Rush Updates

భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.32 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం తిరుమ‌ల లోని 6 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 12 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

సుదూర ప్రాంతాల నుంచి తిరుమ‌ల‌కు త‌ర‌లి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య నిర్వాహ‌ణ అధికారి (ఈవో) ఏవీ ధ‌ర్మా రెడ్డి తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read : Heavy Rains AP : భారీ వ‌ర్షం ఏపీ అస్త‌వ్య‌స్తం

Leave A Reply

Your Email Id will not be published!