Tirumala : కనువిందు చేసిన కళా రూపాలు
మాడ వీధుల్లో శ్రీనివాసుడి దర్శనం
Tirumala : తిరుమల – పుణ్య క్షేత్రమైన తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సింహ వాహన సేవలో తమిళనాడు కళా బృందాలు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
Tirumala Events Viral
బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోవ రోజు మంగళవారం భక్తులతో నిండి పోయింది పుణ్యక్షేత్రం. తమిళనాడు రాష్ట్రం శ్రీరంగానికి చెందిన రాజీ బృందం మొయిళ్ళాట్టం నృత్యాన్ని ప్రదర్శించారు. చెన్నైకి చెందిన పుష్కల బృందం శ్రీనివాస పద్మావతి అమ్మ వారి నృత్యంతో కనువిందు చేశారు.
ఎరోడ్, చెన్నైకి చెందిన చిత్రా శివకుమార్ నేతృత్వంలో భరత నాట్యాన్ని ప్రదర్శించారు. చెన్నైకి చెందిన లత బృందం మీనాక్షి అమ్మ వారి నృత్యంతో అలరించారు. సేలానికి చెందిన శ్రీ రాజా బృందం గోపికా నృత్యాలతో అలరించారు. పాండిచ్చేరికి చెందిన విచిత్ర బృందం భరత నాట్యంతో ఆకట్టుకున్నారు.
అదేవిధంగా, బెంగుళూరుకు చెందిన అభిరామి ఆధ్వర్యంలో చంద్రచూడా నృత్యంతో కనువిందు చేశారు. విజయవాడకు చెందిన వైజయంతి మాల ఆధ్వర్యంలో కోలాటాలు, విశాఖపట్నంకు చెందిన శ్రీ పరమేశ్వర శర్మ బృందం కోలాటాలతో ఆడిపాడి అభినయించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
Also Read : Revanth Reddy Arrest : గన్ పార్క్ వద్ద రేవంత్ అరెస్ట్