Tirumala : 19న తిరుమలలో పుష్పయాగం
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala : తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19వ తేదీన పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. . నవంబరు 18న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
Tirumala Events
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ చేపడతారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. సర్వ దర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది.
Also Read : Telangana Congress Comment