Tirumala Swarna Ratham : స్వర్ణ రథం శ్రీవారి దర్శనం
పోటెత్తిన భక్త జనం
Tirumala Swarna Ratham : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల. స్వామి వారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. తాజాగా శ్రీనివాసుడిని 65 వేల 422 మంది దర్శించుకున్నారు. 33 వేల 212 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Tirumala Swarna Ratham Event
ఇదిలా ఉండగా ప్రతి నిత్యం స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.84 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు అందిస్తున్న శ్రీవారి సేవకుల సేవలను కొనియాడారు. నిస్వార్థంగా చేస్తునన్ సేవలు ఇలాగే కొనసాగించాలని టీటీడీ ఎల్లప్పుడూ వారికి సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు చైర్మన్.
ఇక ఉత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి స్వర్ణ రథంపై(Tirumala Swarna Ratham) ఊరేగారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అశ్వ వాహనంపై దర్శనం ఇచ్చారు.
Also Read : BJP MLA Raja Singh : ఎమ్మెల్యే రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేత