TTD : భక్తులకు సర్వదర్శనం ప్రారంభం
సూర్య గ్రహణం అనంతరం శుద్ది
TTD : సూర్యగ్రహణం దెబ్బకు దేశంలోని ఆలయాలన్నీ మూసుకున్నాయి. విశిష్ట పూజలు చేసిన అనంతరం ఆలయాలలో తిరిగి భక్తులకు దర్శనం కల్పించే పనిలో పడ్డాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగిన తిరుమల(TTD) శ్రీవారి ఆలయాన్ని సూర్య గ్రహణం కారణంగా మూసి వేశారు.
సూర్య గ్రహణం పూర్తయిన అనంతరం శ్రీ వేంకటేశ్వర, అలివేలు మంగమ్మ ఆలయాన్ని పూర్తిగా శుద్ది చేశారు. అంతకు ముందు లడ్డూ ప్రసాదాన్ని, అల్పహారాన్ని, అన్నదాన వితరణను పూర్తిగా నిలిపి వేశారు.
ఇక శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8.30 గంటల లోపు శుద్ది చేశారు. అనంతరం భక్తులకు సర్వ దర్శనం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవాళ ఉదయం 7 గంటల నుండి 7.45 గంటల దాకా భక్తులను సర్వ దర్శనానికి పర్మిషన్ ఇచ్చారు. అంతకు ముందు ఉదయం 8.11 గంటలకు ఆలయం తలుపులూ మూసి ఉంచారు.
12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచారు. ఆలయ శుద్ది, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు స్వామి వారికి నిర్వహించారు.
సుదూర ప్రాంతాల నుండి స్వామి వారిని దర్శించు కునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి సమాచారం లేక పోవడం వల్ల ఇలా జరిగిందని వాపోయారు. ఇదిలా ఉండగా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును రాత్రి ఏడున్నర గంటలకు తెరిచారు.
దీంతో ఆకలితో ఉన్న భక్తులకు కాస్తంత ఉపశమనం కలిగింది. అంతకు ముందు శుద్ది అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. పలు చోట్ల ఫుడ్ కౌంటర్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు.
Also Read : అయోధ్య అద్భుతం ‘మోదీ’ దీపోత్సవం