TKS Elangovan : మాతృ భాష భేష్ హిందీ భాష వేస్ట్
డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్
TKS Elangovan : మొదటి నుంచీ హిందీ భాషను వ్యతిరేకిస్తూ వస్తోంది డీఎంకే. ఆ పార్టీనే కాదు కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చిన అన్నాడీఎంకే సైతం తమిళ భాష గొప్పదని అంటోది. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య, హెచ్ డి కుమార స్వామి మండిపడ్డారు. ఇదే సమయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు.
ఎట్టి పరిస్థితుల్లో హిందీని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. దిగ్గజ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం తమిళం అద్భుతమైన భాష అంటూ పేర్కొన్నాడు.
బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది డీఎంకే. తాజాగా అదే పార్టీకి చెందిన ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్(TKS Elangovan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మాతృ భాష భేష్ హిందీ వేస్ట్ అని పేర్కొన్నారు. ఒక వేళ హిందీని ప్రవేశ పెడితే తమిళులు శూద్రులుగా మారుతారని కామెంట్ చేశారు.
హిందీని వాడుతున్న రాష్ట్రాలు అభివృద్దిలో వెనుకంజలో ఉన్నాయని కానీ మాతృ భాషను అమలు చేస్తున్న రాష్ట్రాలు ప్రగతిలో ముందంజలో ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ.
హిందీ భాషను తప్పనిసరి చేసి మళ్లీ మను ధర్మాన్ని రుద్దాలని చూస్తున్నారని దీనిని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ద్రవిడార్ కజగం నిర్వహించిన సభలో ఇళంగోవన్(TKS Elangovan) మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాను షేక్ చేశాయి. హిందీ కచ్చితంగా అమలు చేయాలన్న అమిత్ షా తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : దేశం పరువు తీసిన మతోన్మాదం – రాహుల్