TMC Rally : అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ ) పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ లో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సరే 50,000 వేల మెజారిటీతో గెలుపొందుతామని ప్రకటించారు టీఎంసీ(TMC) నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఈ మేరకు ఆయన ర్యాలీ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు తప్పుడుగా ప్రకటించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. లేకపోతే టీఎంసీ గెలిచి ఉండేదన్నారు.
భారతీయ జనతా పార్టీ టీఎంసీని(TMC) లేకుండా చేయాలని అనుకుందని కానీ తనే అడ్రస్ లేకుండా పోయిందన్నారు. కేంద్రం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. దీంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు నందిగ్రామ్ మళ్లీ ఫోకస్ లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి చెందిన సువేందు అధికారి చేతిలో ఓడి పోయిన భూభాగంలోకి ప్రవేశించింది టీఎంసీ.
ఎంపీ ఎన్నికల కంటే ముందు ఈ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో సత్తా చాటాలని అనుకుంటోంది. టీఎంసీ సబో జోవర్ (న్యూ వేవ్ ) పేరుతో ప్రచార యాత్ర చేపట్టారు అభిషేక్ బెనర్జీ. నందిగ్రామ్ లో 20 కిలోమీటర్ల ర్యాలీకి నాయకత్వం వహించారు. సువేందు అధికారి లోడ్ షెడ్డింగ్ ద్వారా గెలిచారంటూ ఆరోపించారు.
Also Read : Ashwini Vaishnaw
