Anubrata Mondal : టీఎంసీ నేత అనుబ్రతా మోండల్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కలకలం
Anubrata Mondal : కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక దాని వెంట మరొకటి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే టీచర్ల భర్తీ స్కీం స్కాంలో కేబినెట్ మంత్రి పార్థ ఛటర్జీని, ఆయన సహాయకురాలు ప్రముఖ నటి అర్షిత ముఖర్జీని అరెస్ట్ చేసింది.
ఇళ్లలో సోదాలు చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). రూ. 50 కోట్ల నగదుతో పాటు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజాగా మరో టీఎంసీ నేతకు షాక్ ఇచ్చింది సీబీఐ. విచారణకు సహకరించనందుకు తృణమూల్ నాయకుడు అనుబ్రతా మోండల్ ను గురువారం అదుపులోకి తీసుకుంది.
ఆయన పశువుల స్మగ్లింగ్ కు పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే పలుసార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కానీ కావాలని అనారోగ్య కారణాల సాకుతో విచారణకు డుమ్మా కొట్టాడు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు తన షెడ్యూల్ ను హాజరు కావడానికి రెండుసార్లు దాట వేశారు. దీంతో రంగంలోకి దిగిన టీఎంసీ నేతను పట్టుకుంది. టీఎంసీలో ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు.
అనుబత్రా మోండల్(Anubrata Mondal) ను స్వంత నివాసం నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. పశువుల స్మగ్లింగ్ కేసు విచారణకు రమ్మంటే రావడం లేదంటూ ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
మోండల్ ను బోల్ పూర్ లోని నివాసం నుంచి అరెస్ట్ చేసినట్లు సీబీఐ ప్రకటించింది. మోండల్ ప్రస్తుతం బీర్బూమ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Also Read : ఐటీ దాడుల్లో 58 కోట్ల నగదు 38 కిలోల బంగారం