TMC Amit Shah T Shirt : షాను ఎగ‌తాళి చేస్తూ టీఎంసీ టీ ష‌ర్ట్

TMC Amit Shah T Shirt : భార‌తీయ జ‌న‌తా పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాట‌ల యుద్దం న‌డుస్తోంది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు టీఎంసీని , నేత‌ల్ని, మంత్రుల‌ను టార్గెట్ చేశాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మంత్రుల‌తో పాటు ఓ కీల‌క నాయ‌కుడు, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీకి షాక్ ఇచ్చింది. ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది.

బొగ్గు, ప‌శువుల స్కాంలో ప‌లువురిపై కేసులు న‌మోదు చేసింది. తాము ఎన్ని దాడులు చేసినా లేదా కేసులు న‌మోదు చేసినా భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం మమ‌తా బెన‌ర్జీ.

తాజాగా అమిత్ షా ముఖంతో కూడిన కార్టూన్ తో పాటు ఇండియాస్ బిగ్గెస్ట్ ప‌ప్పు అంటూ క్యాప్ష‌న్ జ‌త చేశారు. ఆయా టీ ష‌ర్టులు ఇప్పుడు రాష్ట్రంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

న‌లుపు, తెలుపు, ప‌సుపు రంగుల‌లో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ టీ ష‌ర్ట్ ధ‌రించారు. ఫ్యాష‌న్ ను రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌గా చాలా కాలంగా ఉప‌యోగిస్తున్నారు.

టీఎంసీకి చెందిన కార్య‌క‌ర్త‌లు త‌న ప్ర‌త్య‌ర్థిపై దాడి చేసేందుకు టీ ష‌ర్ట్ ను(TMC Amit Shah T Shirt)   రూపొందించింది. ఆయా పార్టీలు ఒక‌రిపై మ‌రొక‌రు ఎగ‌తాళి చేయ‌డం అల‌వాటుగా మారింది.

ఇప్ప‌టికే బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప‌ప్పు అని పేరు పెట్టింది. దీనిని సాకుగా తీసుకుని టీఎంసీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అమిత్ షాను ఎగ‌తాళి చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మొత్తంగా టీష‌ర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేసులో ఉన్నా – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!