Nawab Malik : 21 వ‌ర‌కు న‌వాబ్ మాలిక్ క‌స్ట‌డీకి

గ‌త నెల 23న ఈడీ అరెస్ట్

Nawab Malik : కేంద్ర స‌ర్కార్ కు మ‌రాఠా ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తూనే ఉంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న నువ్వా నేనా అన్న పోరు ఇప్పుడు మంత్రుల‌కు చుట్టు కుంటోంది.

ఇప్ప‌టికే హోం మినిస్ట‌ర్ ను రాజీనామా చేసేలా చేసిన కేంద్రం మ‌రోసారి త‌న ఆధీనంలోని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసిగొల్పింది.

ఇందులో భాగంగా నిన్న‌టి దాకా పులిలా గాండ్రిస్తూ వ‌చ్చిన మ‌రాఠా మ‌హా వికాస్ అగాధీ సంకీర్ణ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ.

ఆ ప్ర‌భుత్వానికి చెందిన న‌వాబ్ మాలిక్(Nawab Malik) ను ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు లేకుండానే అరెస్ట్ చేసింది. ఆయ‌న ఎన్సీపీ నాయ‌కుడిగా ఉన్నారు. ఈనెల 21 వ‌ర‌కు జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని ప్ర‌త్యేక పీఎంఎల్ ఏ కోర్టు ఇవాళ ఆదేశించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా నేర చ‌రిత్ర క‌లిగిన వ్య‌క్తిగా పేరొందిన మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం , ఆయ‌న అనుచ‌రుల‌తో మాలిక్ మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో పాల్గొన్నాడంటూ ఈడీ ఆరోప‌ణ‌లు చేసింది.

అందుకు తగిన ఆధారాలు కూడా స‌మ‌ర్పించింది. ఇదే స‌మ‌యంలో ఎనిమిది గంట‌ల పాటు విచార‌ణ చేప‌ట్టింది. అయితే తాను ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేదంటూ స్ప‌ష్టం చేశారు న‌వాబ్ మాలిక్.

గ‌త ఫిబ్ర‌వ‌రి 23న మాలిక్ ను అదుపులోకి తీసుకుంది. ఈడీ రిమాండ్ ఈరోజుతో ముగియ‌డంతో న‌వాబ్ మాలిక్ ను ఈడీ కోర్టు ముందు హాజ‌రు ప‌రిచింది.

రిమాండ్ పొడ‌గింపున‌కు ఎలాంటి అభ్య‌ర్థ‌న చేయ‌క పోవ‌డంతో మ‌ళ్లీ క‌స్ట‌డీకి న‌వాబ్ మాలిక్ ను పంపింది. ఆయ‌న‌ను కోర్టులో ప్ర‌వేశ పెట్టే కంటే ముందే జేజే ఆస్ప‌త్రిలో చికిత్స‌లు చేయించింది ఈడీ.

Also Read : భార‌త రాయ‌బారి అనుమానాస్ప‌ద మృతి

Leave A Reply

Your Email Id will not be published!