S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) సంచలన ప్రకటన చేశారు. భారత దేశం స్వతంత్ర విధానాన్ని అవలంభిస్తుందని, ఇంకొరి దేశం పెత్తనాన్ని ఎంత మాత్రం సహించదని హెచ్చరించారు.
తాము ప్రతి దేశంతో మైత్రిని కోరుకుంటామని, శాశ్వత సంబంధాన్ని కలిగి ఉండేలా ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇతర దేశాలు కావాలని కయ్యానికి కాలు దువ్వుతామంటే చేతులు ముడుచుకుని కూర్చోదని స్పష్టం చేశారు.
మా విదేశాంగ విధానం ఒక్కటే ప్రపంచంలో శాంతి విలసిల్లడం. మేం ఎవరితో యుద్దానికి దిగం. కావాలని తూలనాడం. ప్రతి ఒక్కరికీ, ప్రతి దేశానికి స్వేచ్ఛ, పరిమితులు ఉంటాయని భారత్ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తిస్తుందన్నారు.
కానీ తమ దేశం అంతర్భాగంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు జై శంకర్(S Jai Shankar). ఉక్రెయిన్ , రష్యా మధ్య జరుగుతున్న యుద్దంలో భారత్ ఇప్పటి వరకు మధ్యే మార్గాన్ని అవలంభించింది.
తాము ఈరోజు వరకు యుద్దాన్ని ఆపాలని కోరుతూ వచ్చామన్నారు. ఇదే విషయాన్ని ఇరు దేశాధి నేతలు జెలెన్ స్కీ, పుతిన్ కు తెలియ చేశామన్నారు విదేశాంగ శాఖ మంత్రి. కానీ వారు వినిపించు కోలేదు.
యావత్ ప్రపంచం అంతా దాడులను ఆపాలని కోరుతున్నాయి. భారత్ కూడా విస్పష్టంగా ఆ దేశాధినేతకు, విదేశాంగ మంత్రికి విన్నవించిందన్నారు. కానీ ఎవరి పరిమితులకు లోబడి వారు ఉండాలన్నారు.
ఇదే సమయంలో బలమైన వైఖరి తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో జై శంకర్ అలీన విదేశాంగ విధానాన్ని పునరుద్ధాటించారు. భారత్ తాను ఎంచుకున్న మార్గంలో ఇతర దేశం ఆమోదం అవసరం లేదన్నారు.
Also Read : మాజీ పీసీసీ చీఫ్ జాఖర్ కు బిగ్ షాక్