#IndianWriters : మ‌నోళ్లు టాప్ ఇండియ‌న్ రైట‌ర్లు

ప్ర‌పంచాన్ని మెస్మ‌రైజ్ చేస్తున్న పుస్త‌కాలు

Indian Writers: సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది పుస్తకాలే. జీవితాన్ని, లోకాన్ని ఆవిష్కరించే అరుదైన సన్నివేశం ఒక్క రచయితలు, కవులు, కళాకారులకు మాత్రమే దక్కుతుంది. సాహిత్య పరంగా భారత దేశం సమున్నతమైన శిఖరాలను అధిరోహించింది. వేలాది మంది తమ ప్రతిభా పాటవాలతో అద్భుతమైన రచనలు వెలుగులోకి తీసుకు వచ్చారు. ఇదంతా క్రియేటివిటీకి సంబంధించింది. ఇక ఇండియా పరంగా చూస్తే అత్యుత్తమమైన, ఎన్నదగిన 10 మంది రైటర్స్ ను ఓ సంస్థ ఎంపిక చేసింది. వారిలో మొదటి ప్లేస్ దక్కించుకున్నారు చేతన్ భగత్. ఆర్ట్, లిటరేచర్, సైన్స్, తదితర రంగంలో ఎందరో రాణిస్తున్నారు.

ఈ దేశంలో కుల, మతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 20 భాషల్లో సాహిత్యం విరాజిల్లుతోంది. ది న్యూ యార్క్ టైమ్స్ 2008 లో ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ లో టాప్ రైటర్ గా చేతన్ భగవత్(Indian Writers) ను ఎంపిక చేసింది. ఆథర్, స్క్రీన్ రైటర్, కాలమిస్ట్, టీవీ పెర్సనాలిటీ గా పేరొందారు. టూ స్టేట్స్ , హాఫ్ గర్ల్ ఫ్రెండ్, వన్ ఇండియన్ గర్ల్ పేరుతో పుస్తకాలు రాశారు. రెండో ప్లేస్ లో అమ్రితా ప్రీతం నిలిచారు. పోయెట్రీ, లిటరేచర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు. ఆమె రచనా శైలీ ఎందరినో ఆకట్టుకుంది. మరో ఎన్నదగిన రచయిత్రిగా పేరొందారు ఝంపా లహరి. నవలలతో పాటు వివిధ అంశాలపై పలు వ్యాసాలు రాశారు. ఇక ఇండియాలో అత్యంత జనాదరణ కలిగిన రచయితగా పేరొందారు కుశ్వంత్ సింగ్. ట్రైన్ టు పాకిస్తాన్, కంపెనీ ఆఫ్ విమెన్ లాంటి నవలలు రాశారు.

మరో రచయిత ఆర్.కె.నారాయణ్ (Indian Writers)కూడా మోస్ట్ పాపులర్ రైటర్ గా ఉన్నారు. ఆయన రాసిన వాటిలో ఎక్కువగా పేరు తీసుకు వచ్చేలా చేసింది ది డార్క్ రూమ్ పుస్తకం. ఇక సాహిత్యంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా రవీంద్ర నాథ్ ఠాగూర్ గుర్తింపు పొందారు. మన్సాయ్, గీతాంజలి, తదితర రచనలు చేశారు. ఆయన గొప్ప భావుకుడు, ప్రపంచం మెచ్చిన రచయిత కూడా. గీతాంజలి ఇప్పటికీ మోస్ట్ పాపులర్ రచనల్లో ఒకటిగా ఉంది. పంజాబ్ కు చెందిన మరో రచయిత రస్కిన్ బాండ్ గొప్ప రైటర్ గా పేరొందారు. స్వస్థలం ఇండియా అయినప్పటికీ ఎక్కువ కాలం ఇంగ్లాడ్ లో గడిపారు. ది బ్లూ అంబెరిల్లా పేరుతో రాసిన పుస్తకం నివ్వెర పోయేలా చేసింది.

ఇండియాకు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తీసుకు వచ్చారు మరో రచయిత విక్రమ్ సేథ్(Indian Writers). ది స్యూటబుల్ బాయ్ పేరుతో రాసిన బుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రచయిత్రులలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అరుంధతి రాయ్. ఆమె రాసిన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే పుస్తకం లక్షల్లో అమ్ముడు పోయింది. ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. పదో ప్లేస్ లో బెంగాల్ సాహిత్యాన్ని తన రచనలతో కొత్త పుంతలు తొక్కించిన శరత్ చంద్ర నిలిచారు. ఆయన రాసిన దేవదాస్, పరిణీత నవలలు దేశాన్ని ఒక ఊపు ఊపాయి. వీలైతే మీరు వీలు చిక్కినప్పుడు వీరు రాసిన పుస్తకాలు చదవండి.

No comment allowed please