Jagdeep Dhankar BBC : విష పూరిత ప్ర‌చారం ప్ర‌మాద‌క‌రం

ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్

Jagdeep Dhankar BBC : భార‌త దేశ ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల మోదీ ది క్వ‌శ్చ‌న్ పేరుతో బీబీసీ జ‌న‌వ‌రి 24న ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌సారం చేసింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. మోదీ సీఎంగా ఉన్న స‌మ‌యంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావించింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కేంద్ర స‌ర్కార్. పూర్తిగా నిషేధించాల‌ని ఆదేశించింది. ఆ త‌ర్వాత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం, కేంద్రాన్ని ఆదేశించ‌డం జ‌రిగింది.

అనంత‌రం కేంద్ర ఐటీ శాఖ బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో రెండు రోజుల పాటు దాడులు చేపట్టింది. కీల‌క‌మైన మొబైల్స్ , ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ ల‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున త‌ప్పు ప‌ట్టాయి ఆప్ , కాంగ్రెస్ , టీఎంసీ పార్టీలు.

ఇది పూర్తిగా మీడియా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా అభివ‌ర్ణించాయి. ఈ త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ తీవ్రంగా స్పందించారు. అయితే ఆయ‌న ప్ర‌త్యేకంగా బీబీసీని ప్ర‌స్తావించ‌కుండానే సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

విష పూరిత ప్ర‌చారం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు. ఇది ఎప్ప‌టికీ మంచిది కాద‌ని పేర్కొన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ మెకానిజం అన్న‌ది ప‌టిష్టంగా లేక పోతే మెసేజింగ్ లో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్చ విలువైన‌ది, విడ‌దీయ రానిది. భార‌త దేశం కంటే ప్ర‌పంచంలో ఏ దేశం దీనిని గౌర‌వించ లేద‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి(Jagdeep Dhankar BBC).

Also Read : ఆది మ‌హోత్స‌వం అభివృద్దికి సంకేతం

Leave A Reply

Your Email Id will not be published!