Jagga Reddy : టీపీసీసీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ జగ్గారెడ్డికి షాక్ ఇచ్చింది. ఆయనకు ఇప్పటి వరకు అదనంగా ఉన్న పార్టీ బాధ్యతలను తొలగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు టీపీసీసీ ప్రకటన ద్వారా వెల్లడించింది. రేవంత్ రెడ్డి (Rewanth Reddy) టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన నాటి నుంచి తన స్వరాన్ని పెంచుతూ వచ్చారు. తాజాగా హైదరాబాద్ లో సోనియా విధేయులం పేరుతో ఏర్పాటైన సమావేశం అనంతరం సంచలన ఆరోపణలు చేశారు.
దమ్ముంటే రేవంత్ రెడ్డి (Dammunte Rewanth Reddy) తనపై అభ్యర్థిని పెట్టి గెలవాలని సవాల్ విసిరారు. సీరియస్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి (Jagga Reddy ) . ఆయన పనితీరును జగ్గారెడ్డి (Jaggareddy) ప్రశ్నిస్తూ, నిలదీస్తూ వస్తున్నారు.
రేవంత్ రెడ్డి (Rewanth Reddy)పార్టీ లైన్ లో నడవడం లేదని, తన ఇమేజ్ పెంచుకునేందుకు యత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిందన్నారు.
మాణిక్యం ఠాగూర్ పై కూడా ఫైర్ అయ్యారు. ఇటీవల వీహెచ్ హరీశ్ రావుతో కలవడం, జగ్గారెడ్డి (Jagga Reddy ) మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా చోటు చేసుకున్న మీటింగ్ వద్దంటూ ఏఐసీసీ నుంచి ఫోన్ వచ్చింది. కానీ వాటిని బేఖాతర్ చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఫోరంలో మాట్లాడుకోవాలో తప్ప ఇలాంటి మీటింగ్ లు మంచిది కాదన్నారు.
Also Read : ముందస్తుకు వెళ్లం 105 సీట్లు ఖాయం