TPCC Row : రేవంత్ నిర్వాకం పార్టీకి నష్టం
డిగ్గీ రాజాకు ఫిర్యాదుల పర్వం
TPCC Row : తెలంగాణ కాంగ్రెస్ లో వేడి చల్లార లేదు. సీనియర్లు బాహాటంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైనే గురి పెట్టారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఆయన లోపల మాట్లాడుతుండగానే బయట పార్టీ శ్రేణులు బాహా బాహీకి దిగాయి. రేవంత్ రెడ్డి వన్ మెన్ షో చేస్తున్నాడని ఇది పార్టీకి పూర్తిగా నష్టం చేకూరుతోందని ఆరోపించారు సీనియర్లు(TPCC Row).
ఫిర్యాదు చేసిన వారిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి , దామోదర రాజ నర్సింహ్మ, వి. హనుమంత్ రావు, మధుయాష్కి గౌడ్ ఉన్నారు. మరో వైపు మల్లురవి సర్ది చెప్పబోయినా వినిపించు కోలేదు. పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టి పోయిందని, వర్గాలుగా విడగొట్టారంటూ ఆరోపించారు.
తమను బయటకు పంపాలని కోరుకుంటున్నాడని ఆరోపించారు. అందుకే ద్రోహులు, కోవర్టులు అంటూ ప్రచారం చేయిస్తున్నాడంటూ మండిపడ్డారు సీనియర్లు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని, తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వచ్చాక పార్టీ మూడో స్థానానికి పడి పోయిందని ఆవేదన చెందారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేస్తున్న వారిని పక్కన పెట్టారంటూ రేవంత్ పై తీవ్ర(TPCC Row) ఆరోపణలు చేశారు.
డిగ్గీ రాజా పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను పార్టీ అప్పగించింది. ఆయన 50 మందికి పైగా నేతలతో భేటీ అయ్యారు. హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీకి 35 శాతం ఉన్న ఓటింగ్ రేవంత్ వచ్చాక 1.5 శాతానికి , మునుగోడులో 49 నుంచి 10 శాతానికి పడి పోయిందని ఆధారాలతో సహా వివరాలు దిగ్విజయ్ సింగ్ కు అందజేశారు.
Also Read : రేవంత్ వన్ మ్యాన్ షో చెల్లదు