Ashok Gehlot : రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot )స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రస్తుతానికి ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
జోధ్ పూర్ లోని జలోరీ గేట్ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలను కాపాడాలంటూ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని చెప్పారు సీఎం.
మంగళవారం ఉదయం ట్విట్టర్ ద్వారా అక్కడి ప్రజలకు విన్నవించారు. జోధ్ పూర్ , మార్వార్ ప్రజలు సంయనం పాటించాలని కోరారు. సోదర సంప్రదాయాన్ని గౌరవిస్తూ శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడినా లేదా పాల్పడేందుకు యత్నించినా ఊరుకోబోమంటూ హెచ్చరించారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot ). ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ముస్లింలు జరుపుకునే ఈద్ , హిందువులు నిర్వహించే అక్షయ తృతీయ పండగుగలు ఒకే సారి రావడంతో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఎవరు దీని వెనుక ఉన్నారనే దానిపై విచారణ జరుగుతోంది.
రాళ్ళు రువ్వడంతో పాటు ఘర్షణలో రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. వీరిని నియంత్రించేందుకు యత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
పరిస్థితి అదుపులో ఉందని, ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు జోధ్ పూర్ పోలీస్ కమిషనర్ నవజ్యోతి గగోయ్ వెల్లడించారు.
Also Read : పార్టీ ఉందా ప్రశాంత్ కిషోర్ !