Train Accident : రైలు ప్ర‌మాదం సీఎం దిగ్భ్రాంతిక‌రం

శ్రీ‌కాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న

Train Accident : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. నిన్న రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ నుంచి గౌహ‌తి వెళుతున్న సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ రైలు శ్రీ‌కాకుళం జిల్లా జి.సిగ‌డాం మండ‌లం బాతువ రైల్వే గేటు స‌మీపంలో ఈ ఘ‌ట‌న (Train Accident)చోటు చేసుకుంది.

గేటు స‌మీపం వ‌చ్చే స‌రికి ట్రైన్ నిలిచింది. దీంతో బోగీల్లో ఉన్న కొంద‌రు ప్ర‌యాణీకులు కింద‌కు దిగారు. ప‌క్క ట్రాక్ వైపున‌కు వెళ్లారు. ఇదే క్ర‌మంలో భువ‌నేశ్వ‌ర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ పై ఉన్న ప్ర‌యాణీకుల‌ను ఢీకొట్టింది.

తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని రిమ్స్ కు త‌ర‌లించారు పోలీసులు. కాగా చ‌ని పోయిన వారి వ‌ద్ద దొరికిన ఆధార్ కార్డుల ఆధారంగా అసోం, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు.

ఈ ఘ‌ట‌న ఎందుకు జ‌రిగింద‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టారు. ప్రాథ‌మికంగా ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు రైల్వే అధికారులు. రైలులో ఉన్న చైన్ ను లాగ‌డం వ‌ల్ల‌నే రైలు ఆగి పోయింద‌ని తెలిపారు.

కాగా రైలు బోగీలో పొగ‌లు రావ‌డంతో ప్ర‌యాణీకులు భ‌యంతో చైను లాగార‌ని..పారి పోయేందుకు య‌త్నించ‌గా మ‌రో రైలు వ‌చ్చి ఢీకొంద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే రైలు ప్ర‌మాదంపై శ్రీ‌కాకుళం క‌లెక్ట‌ర్ శ్రీ‌కేష్ బి. లాఠ‌క‌ర్ , ఎమ్మెల్యే కిర‌ణ్ కుమార్ స్పందించారు. ఇదిలా ఉండ‌గా సీఎం జ‌గ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భాంత్రిని వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు వైద్య సాయం అందించాల‌ని ఆదేశించారు.

Also Read : జ‌గ‌న్ నాయ‌క‌త్వం శిరోధార్యం

Leave A Reply

Your Email Id will not be published!