Chinna Jeeyar : ఆధ్యాత్మికత తోనే మానవాళిలో పరివర్తన
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి
Chinna Jeeyar : ఆధ్యాత్మికత తోనే సమస్త మానవాళిలో పరివర్తన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి(Chinna Jeeyar ). వెయ్యేళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
భారీ ఎత్తున ఏర్పాటు చేసిన శ్రీ రామానుజుడి విగ్రహం ఆవిష్కరణకు సిద్దమైంది. ఇదే సమయంలో వేలాది మంది భక్తుల సాక్షిగా శోభాయాత్ర కన్నుల పండువగా ప్రారంభమైంది.
దీనిని పురస్కరించుకుని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి (Chinna Jeeyar )హితబోధ చేశారు. ఆధ్యాత్మికత అన్నది ప్రతి ఒక్కరికి అవసరమని బోధించారు.
యాగం చేయడం వల్ల అనేక మార్పులు కలుగుతాయని, మనలోని సంస్కారం మరింత ఉన్నతంగా ఉండాలంటే భక్తితోనే సాధ్యం అవుతుందని చెప్పారు.
సమస్త మానవాళిలో పరివర్తన అన్నది ఒక్కరితోనే లేక ఇతరులు బోధించడం వల్లనో రాదన్నారు. ఆచరణాత్మకంగా సాగాలంటే అందుకు వెయ్యేళ్ల కిందట ఈ భూమి మీద జన్మించిన శ్రీ రామానుజుడును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ లోకంలో మనుషులంతా ఒక్కటేనని, సమస్త జీవ రాశులకు బతికే హక్కు ఉందని చాటిన మహనీయుడని కొనియాడారు. అందుకే ఆ మహానుభావుడు నిత్యం ప్రాతః స్మరణీయుడని ప్రశంసించారు.
ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకునే భాగ్యాన్ని ఆ దైవం మనకు కల్పించాలని కోరుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాగ కుండలాల వద్ద పెద్ద ఎత్తున భక్తులు కొలువు తీరారు.
అంతకు ముందు శోభయాత్ర సందర్భంగా స్వామి వారు మంగళాశీస్సులు అందజేశారు. ఈ వెయ్యేళ్ల ఉత్సవం ప్రతి ఒక్కరిలో దైవ భావాన్ని నెలకొల్పుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.
Also Read : సహస్రాబ్ధి ఉత్సవం ఆధ్యాత్మిక శోభితం