Abhishek Banerjee : నిధుల కోసం కోటి లేఖల ప్రచారం
ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటన
Abhishek Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం వర్సెస్ కేంద్రం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కావాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ పరంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కోటి లేఖలతో ప్రచారం చేపట్టనున్నట్లు ప్రకటించింది.
సీఎం మమతా బెనర్జీ కూడా బెంగాల్ కు పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. పార్టీ పరంగా సంతకాల సేకరణ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) ప్రకటించారు.
చెల్లించని నిధులపై కేంద్రం లోని బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మా కోటా మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి ప్రజల నుంచి సేకరించిన లేఖలను పంపిస్తామని చెప్పారు. ఆ లేఖలన్నీ తాను ఢిల్లీకి తీసుకు వెళతానని తెలిపారు.
ఇప్పటి వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం కింద నిధులు రావాల్సి ఉండగా విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. పీఎంఓకి , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కార్యాలయానికి పంపిస్తామని అన్నారు. తీసుకుంటారా లేక తిరస్కరిస్తారా అనేది ప్రజలు గమనిస్తారని ఆ తర్వాత మరో కార్యాచరణ చేపట్టేందుకు ఆలోచిస్తామని చెప్పారు అభిషేక్ బెనర్జీ.
Also Read : దొరకని సింగ్ బటిండాలో భద్రత