Biplab Deb : త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ రాజీనామా
ఒక ఏడాది ముందే పదవికి గుడ్ బై
Biplab Deb : త్రిపురలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ఒక ఏడాది ముందు తన పదవి నుంచి తప్పుకున్నారు.
రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన అనంతరం బిప్లవ్ దేబ్(Biplab Deb) ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇదిలా ఉండగా త్రిపుర రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరు, కుమ్ములాటల కారణంగానే బిప్లవ్ దేబ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజీనామా అనంతరం బిప్లవ్ దేబ్ మీడియాతో మాట్లాడారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు తాను పని చేయాలని పార్టీ కోరుకుంటోందన్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం జరిగిందని స్పష్టం చేశారు బిప్లవ్ దేబ్.
ఇదిలా ఉండగా త్రిపుర లోని బీజేపీ శాసనసభా పక్షం తన కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అత్యవసర సమావేశం కానుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధిష్టానం ఆదేశించిందా లేక తనంతకు తానుగా బిప్లవ్ దేబ్ రాజీనామా చేశారా అన్నది ఇంకా తెలియడం లేదు. కాగా బిప్లబ్ దేబ్(Biplab Deb) పూర్తి పేరు బిప్లబ్ కుమార్ దేబ్.
త్రిపురకు ఆయన పదో సీఎం. అంతకు ముందు మాణిక్ సర్కార్ ఉన్నారు. బనమాలిపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 25 నవంబర్ 1971లో పుట్టారు.
ఆయన వయసు 50 ఏళ్లు. 2016 నుంచి 2018 వరకు బీజేపీ రాష్ట్ర పార్టీ చీఫ్ గా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాషాయాన్ని విజయ పథంలో నడిపారు బిప్లబ్ దేబ్.
Also Read : భారత ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం