Election Results 2023 : ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
మూడు రాష్ట్రాలలో ఎవరిదో పైచేయి
Election Results 2023 : ఈశాన్య ప్రాంతంలో కీలకమైన మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇండియా టుడే, జీ న్యూస్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
త్రిపుర, నాగాలాండ్ లలో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందని ఇక మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కేవలం 20 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. ఇక్కడ కింగ్ పిన్ గా టీఎంసీ మారబోతోందని తెలిపింది. టీఎంసీకి 11 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు(Election Results 2023) వస్తాయని అంచనా వేసింది జీ గ్రూప్ .
ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకల్లా ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందనే విషయం తేలనుంది. ఈ ఎన్నికలు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమైనవి కావడం విశేషం. మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు కన్నడ నాట ప్రభావం చూపే అవకాశం లేక పోలేదు.
ఇక త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో 60 స్థానాల చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 31 సీట్లకు పైగా రావాల్సి(Election Results 2023) ఉంటుంది. ఇక మేఘాలయలో 60 సీట్లకు గాను 59 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
ఇక్కడ యూడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎన్నికను వాయిదా వేసింది. త్రిపురలో బీజేపీ , మేఘాలయలో ఎన్పీపీ, నాగాలాండ్ లో ఎన్ఈడీ అలయన్స్ కూటమి కొనసాగుతున్నాయి.
Also Read : సిసోడియా బీజేపీలో చేరితే కేసులుండవు