Trivikram Srinivas Comment : క‌లం బ‌లం త్రివిక్ర‌మ్

వెండి తెర‌పై గూరూజీ

Trivikram Srinivas Comment  : సినిమాలు జీవితాల్ని మార్చేస్తాయా. అవునని నిరూపించాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. త‌ను సైన్స్ టీచ‌ర్. కానీ ఎందుక‌నో ముందు నుంచీ త‌న‌కు సాహిత్యం అంటే పంచ ప్రాణం. అదే అత‌డిని అద్భుత‌మైన ర‌చ‌యిత‌గా మార్చేసింది. తన‌లో మ‌నిషి ఉన్నాడు. అంత‌కు మించిన ఫిలాస‌ఫ‌ర్ కూడా తోడ‌య్యాడు. విజ‌యానికి ద‌గ్గ‌రి దారులంటూ ఏవీ ఉండ‌వ‌ని ప‌దే ప‌దే చెప్పే త్రివిక్ర‌మ్ ఏది రాసినా లేక ఏది మాట్లాడినా దాని వెనుక నిగూఢ‌మైన అర్థం దాగి ఉంటుంది. బ‌తుకు ప్ర‌యాణంలో మ‌న‌కు మ‌నంగా లీనమై పోయినప్పుడు కానీ మ‌న‌ల్ని నుంచి మ‌నం వేరై పోయిన‌ప్పుడు కానీ త‌ను త‌ప్ప‌కుండా గుర్తుకు వ‌స్తాడు. సినిమాల ద్వారా , త‌ను రాసిన డైలాగుల ద్వారా వెంటాడుతాడు. సినిమాలంటే పాట‌లు, ఫైట్లు కాద‌ని మాట‌ల‌తో కూడా స‌క్సెస్ చేయొచ్చ‌ని నిరూపించాడు.

Trivikram Srinivas Comment Viral

అత‌డిని సినిమా రంగంలోకి వ‌చ్చిన వెంట‌నే అక్కున చేర్చుకుని స‌హాయ‌కుడిగా పెట్టుకున్నందుకు పోసాని కృష్ణ ముర‌ళిని అభినందించాలి. ఆ త‌ర్వాత త‌న‌లోని టాలెంట్ ను, త‌ను ప‌డిన క‌ష్టాల‌ను , త‌ను అనుభ‌వించిన ప్ర‌తి దానిని సినిమా అనే తెర‌పై ప్ర‌తిఫ‌లించేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Trivikram Srinivas). ఇవాళ ఆయ‌న‌కు ప్ర‌త్యేక రోజు. తెలుగు వారంద‌రికీ కూడా వెరీ వెరీ స్పెష‌ల్. కార‌ణం న‌వంబ‌ర్ 7 ఆకెళ్ల నాగ శ్రీ‌నివాస్ పుట్టిన రోజు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో 1971లో పుట్టాడు. ఆయ‌న‌కు 52 ఏళ్లు. కానీ ఇప్ప‌టికీ 15 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. ఎప్ప‌టికీ చిరున‌వ్వును విడిచి పెట్ట‌ని ఈ ద‌ర్శ‌కుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎక్క‌డ నెగ్గాలో కాదురా ఎక్క‌డ త‌గ్గాలో తెలిసినోడే గొప్పోడు అని రాశాడు.

జీవితానికి స‌రిప‌డా కావాల్సినంత జోష్ త్రివిక్ర‌మ్(Trivikram Srinivas) మాట‌లు, సినిమాలు ఇస్తాయి. అందుకే చాలా మందికి లేనంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది త‌న‌కు. రాసిన డైలాగులు గుండెల్ని త‌డుముతాయి. నిద్ర‌లో సైతం వెంటాడుతాయి. అన్నీ కాద‌ల‌నేని స‌త్యాలు. కొన్ని నిల‌దీస్తాయి. ఇంకొన్ని ప్ర‌శ్నిస్తాయి. మ‌రికొన్ని ఆలోచించేలా త‌లుపు త‌డ‌తాయి. త్రివిక్ర‌మ్ క‌లానికి బ‌ల‌మెక్కువ‌. అంత‌కు మించి పొగ‌రెక్కువ‌. అందుకే త‌ను సినిమా తీశాడంటే సెటైర్ వేసినట్టే. మంచి వ‌క్త కూడా. ఏ అంశంపైన‌నైనా త‌ను అన‌ర్ఘ‌లంగా చెప్ప‌గ‌ల‌డు. మాట‌ల్లో పెట్టి మైమ‌రిచి పోయేలా చేయ‌గ‌ల‌డు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.

ఆయ‌న రాసిన వాటిలో ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసినవి. అందులో సంపాదించ‌డం చేత కాని వాడికి ఖ‌ర్చు పెట్టే అర్హ‌త లేదు. యుద్దంలో గెల‌వ‌డం అంటే శ‌త్రువును చంప‌డం కాదు ఓడించ‌డం. ల‌క్ ఒక‌సారి త‌లుపు త‌డుతుంది..కానీ దుర‌దృష్టం త‌లుపు తీసేంత దాకా త‌డుతూనే ఉంటుంది. క‌న్న వారు, గుడిలో దేవుడు మ‌న వ‌ద్ద‌కు రారు మ‌న‌మే వెళ్లి వాళ్ల‌ను చూడాలి. వినే టైమ్ చెప్పే మ‌నిషి వ‌ల్ల విష‌యం విలువై మారి పోతుంది అని రాస్తాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ క‌లానికి బ‌లం ఎక్కువ‌. అంత‌కు మించి గ‌ట్స్ ఎక్కువ అని చెప్ప‌దు..హ్యాట్సాఫ్ యూ గురూజీ.

Also Read : Kodavatiganti Kutumbarao: కొకు రచనలతో ప్రశిద్ధి చెందిన కొడవటిగంటి

.

Leave A Reply

Your Email Id will not be published!