Trivikram Srinivas : బాస్ నువ్వు సూప‌ర్ బ్రో

రాయ‌డంపైనే త్రివిక్ర‌మ్ ఫోక‌స్

Trivikram Srinivas : మాట‌ల మాంత్రికుడ‌ని ఊరికే అన‌లేదు. ఎక్కువ‌గా చ‌దువుతాడు. ఆపై అద్భుతంగా రాస్తాడు. ప‌లు భాష‌ల‌పై ప‌ట్టుంది. ఒకప్పుడు మాట‌ల ర‌చ‌యిత‌. ఇప్పుడు ద‌ర్శ‌కుడు కూడా. ఆయ‌న గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ రంగంలో త‌న‌దైన ముద్ర క‌లిగిన డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. మాట‌లు పొదుపుగా వాడ‌టంలోనూ వాటిని తూటాలుగా పేల్చ‌డంలోనూ త‌న‌కు తానే సాటి. ద‌ర్శ‌కుల్లో ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్టైల్.

Trivikram Srinivas Writer & Director

త‌ను విప‌రీతంగా పుస్త‌కాల పురుగు. ఏ మాత్రం ఛాన్స్ చిక్కితే వాటిని చ‌ద‌వడ‌మే కాదు ఆక‌ళింపు చేసుకుంటాడు. నోట్స్ రాసుకుంటాడు. ప్ర‌పంచంలో చాలా మంది గొప్ప‌వారి గొప్ప ల‌క్ష‌ణాల్లో ఒక్క‌టి రాసు కోవ‌డం. ప‌ద్ద‌తిగా ఎలా చెప్పాలో, ఎక్క‌డ చెప్పాలో, ఎలాంటి సీన్స్ ను క్రియేట్ చేయాలో త్రివిక్ర‌మ్ కు బాగా తెలుసు. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో గుంటూరు కారం తీస్తున్నాడు.

త‌ను ప్రేమించే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్రో(BRO) ది అవ‌తార్ కు స్క్రీన్ ప్లే తో పాటు అద్భుత‌మైన మాట‌లు అందించాడు. అది సూప‌ర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. అయినా ఎక్క‌డా ఆ విజ‌య‌పు తాలుకు గ‌ర్వం లేకుండానే మౌనంగా త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఫోటో ట్విట్ట‌ర్ లో వైర‌ల్ గా మారింది. నిజంగా నువ్వు సూప‌ర్ బ్రో అంటున్నారు.

Also Read : JP Nadda Jayasudha : కండువా క‌ప్పిన జేపీ న‌డ్డా

Leave A Reply

Your Email Id will not be published!