TRS Meeting : 15న టిఆర్ఎస్ కీలక సమావేశం
అధ్యక్షత వహించనున్న కేసీఆర్
TRS Meeting : దేశంలో బీఆర్ఎస్ పరిస్థితి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా, తదితర అంశాలపై ఈనెల 15న పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన విధాన సభ, లోక్ సభ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం(TRS Meeting) జరగనుంది.
మంగళవారం మధ్యాహ్నం ఈ కీలక మీటింగ్ కొనసాగనుంది. 2 గంటలకు తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మెన్లు, ఇతర పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు.
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం అధికార వర్గంతో పాటు పాలకవర్గం అక్కడే మకాం వేసింది. కానీ ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదు. ఈ తరుణంలో గెలిచిన అనంతరం జరుగుతున్న సమావేశం కావడంతో ఈ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ఉంది.
ఇప్పటికే పార్టీ పట్ల, సర్కార్ పట్ల కొంత వ్యతిరేకత ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మునుగోడులో గెలిచిన జోష్ తో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు టాక్. సిట్టింగ్ లకే ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు.
మరికొందరి ఎమ్మెల్యేల పనితీరు మార్చు కోవాలని కూడా సూచించారు. వచ్చే లేదా ముందస్తు ఎన్నికలకు ఎవరి దుకాణం వారు సర్దు కోవాలని దిశా నిర్దేశనం చేయనున్నారు. మరో వైపు కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోనుంది. వారికి ఏయే సీట్లు కేటాయించాలనే దానిపై కూడా చర్చకు రానుంది. ఇక బీఆర్ఎస్ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు కేసీఆర్.
Also Read : పండుగల వేళ తెలుగు సినిమాలకే ప్రయారిటీ