Modi Jay Shah TRS : జే షా ఎవరో ప్రధాని మోదీ చెప్పాలి
డిమాండ్ చేసిన టీఆర్ఎస్
Modi Jay Shah TRS : తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందంటూ నిప్పులు చెరిగిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై(Modi Jay Shah TRS) టీఆర్ఎస్ సీరియస్ గా స్పందించింది. భారతీయ జనతా పార్టీలో ఎంత మంది వారసులు పదవులు అనుభవించడం లేదంటూ ప్రశ్నించింది.
కోట్లాది రూపాయలు కలిగిన ఏకైక క్రీడా సంస్థ బీసీసీఐలో కార్యదర్శి పదవి అనుభవిస్తూ , పవర్ చెలాయిస్తున్న జే షా(Modi Jay Shah TRS) విషయం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ మన్నె.
ప్రధాని మోదీ దేశ ప్రధానిగా మాట్లాడ లేదని, కేవలం బీజేపీ నాయకుడిగా మాట్లాడారంటూ ఆరోపించారు. పీఎం కేవలం పరివార్ వాదం గురించి మాత్రమే మాట్లాడారని, అదే జరిగితే బీసీసీఐని ఏలుతున్న జే షా ఎవరు.
ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు కాదా అని ప్రశ్నించారు. రాజ్ నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన తనయుడు కూడా పదవి అనుభవిస్తున్నారు.
ఇది వారసత్వ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఊరికే రాలేదని కేసీఆర్ పోరాడితే వచ్చిందన్నారు. అందుకే ప్రధాని మోదీ ఇలా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
పరివార్ వాది పార్టీలు తమ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తాయి. పేదల గురించి పట్టించు కోవన్నారు నరేంద్ర మోదీ. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు క్రిశాంక్ మన్నె.
ప్రధాని తమ గురించి మాట్లాడే ముందు ఆ పార్టీలో ఎందరు పదవులు అనుభవిస్తున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. మోదీ మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
Also Read : ఢిల్లీ ఎల్జీగా కొలువుతీరిన సక్సేనా