Telangana Governor : గవర్నర్ పై ‘గులాబీ’ గుస్సా
కావాలనే బిల్లుల పెండింగ్
Telangana Governor : తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారి పోయింది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. గవర్నర్ కావాలని ఇబ్బంది పెడుతోందంటూ , ఫక్తు రాజకీయ కార్యకర్తగా మారి పోయారంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
ఇక ఢిల్లీ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు గవర్నర్ . తన పరిమితి దాటి మాట్లాడటం మంచి పద్దతి కాదని తను కావాలంటే అనగలనని కుండ బద్దలు కొట్టారు సీఎం కేసీఆర్. మొదట్లో సీఎం , గవర్నర్ ల మధ్య సఖ్యతగా ఉన్నప్పటికీ వీరి మధ్య ప్రధాన కారణం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై సంతకం చేయక పోవడం వివాదాన్ని రాజేసింది.
తాజాగా టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. బిల్లుల పెండింగ్ లకు ప్రధాన కారణం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Telangana Governor) అని ఆరోపించారు. కావాలని సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడ్డారు.
ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాలను గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గవర్నర్ ను ఏకి పారేస్తున్నారు. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో గవర్నర్ కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తన ఖర్చులను భరించడం లేదని ఆరోపించారు. తనకు వచ్చే డబ్బుల నుంచే ఖర్చు చేసుకుంటున్నానని తెలిపారు.
Also Read : మాణిక్యం ఠాగూర్ రాజీనామా