TRS Yashwant Sinha : య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు

సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని వెల్ల‌డి

TRS Yashwant Sinha : భార‌త దేశంలో అత్యున్న‌త‌మైన ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎవ‌రు ఎన్నిక‌వుతార‌నే దానిపై ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ (ఎన్డీయే) ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసి బిడ్డ ద్రౌప‌ది ముర్ము ను ఎంపిక చేసింది.

ఆ మేర‌కు ఆమె 24న నామినేష‌న్ దాఖ‌లు కూడా చేశారు. ఇక ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ప్ర‌క‌టించారు. ఆయ‌న ఈనెల 27న సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.

ఇక ఏపీకి చెందిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్డీయే అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌త‌ను విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు(TRS Yashwant Sinha) ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ పార్టీకి చెందిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

దీంతో ఇప్ప‌టి దాకా కొన‌సాగుతూ వ‌స్తున్న టీఆర్ఎస్ స‌పోర్ట్ ఎవ‌రికి అన్న దానిపై సందిగ్ద‌త తొలగి పోయింది. ఇవాళ పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించిన విప‌క్షాల మీటింగ్ కు టీఆర్ఎస్ దూరంగా ఉంది. రెండు వారాల అనంత‌రం త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం విశేషం.

అయితే కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో భార‌త రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో య‌శ్వంత్ సిన్హా అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారు.

ఇవాళ నామినేష‌న్ వేసే ప్ర‌క్రియ‌లో టీఆర్ఎస్ ఎంపీల‌తో పాటు తాను కూడా పాల్గొంటాన‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.

Also Read : ‘జూప‌ల్లి..బీరం’ స‌వాళ్ల ప‌ర్వం

Leave A Reply

Your Email Id will not be published!