Trump Elon Musk : మస్క్ మన్నించు ట్విట్టర్ లోకి రాలేను
స్పష్టం చేసిన అమెరికా మాజీ చీఫ్ ట్రంప్
Trump Elon Musk : అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించినందుకు సంస్థ బాస్ , తన స్నేహితుడు ఎలాన్ మస్క్ కు(Trump Elon Musk) ధన్యవాదాలు తెలిపారు. అయితే తనకు ట్విట్టర్ లో చేరాలని లేదని వెల్లడించారు. అంతగా ఆసక్తి లేదన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హింసను ప్రేరేపించారంటూ సామాజిక మాధ్యమాలు ట్విట్టర్ తో పాటు గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , తదితర సోషల్ మీడియా సంస్థలు ప్రకటించాయి. దీంతో నిప్పులు చెరిగారు డొనాల్డ్ ట్రంప్.
విచిత్రం ఏమిటంటే ట్విట్టర్ లీగల్ హెడ్ విజయా గద్దె ఈ హింసోన్మాదానికి ట్రంప్ కారకుడంటూ నివేదిక ఇచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి రిపోర్ట్ వచ్చిన వెంటనే ట్విట్టర్ డొనాల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయంపై నిప్పులు చెరిగారు ట్రంప్. తానే ఓ సోషల్ మీడియాను క్రియేట్ చేస్తానంటూ ప్రకటించాడు. చెప్పినట్లుగానే ట్రూత్ సోషల్ యాప్ ను రూపొందించాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉందని, దానిని తాను చూసుకుంటానని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా 22 నెలల తర్వాత ట్రంప్ ఖాతా తెరవబడింది.
కారణం తన స్నేహితుడు మస్క్ రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేయడంతో ట్రాప్ కు ఛాన్స్ లభించింది. ఇదిలా ఉండగా అంతకు ముందు ఎలాన్ మస్క్ ట్రంప్ ఖాతా పునరుద్దరణపై పోల్ చేపట్టారు. 51.8 శాతం మంది రావాలని కోరారు.
Also Read : రస్నా ఫౌండర్ ‘ఖంబట్టా’ కన్నుమూత