Trump :వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉంటారు. తదుపరి యుద్దం తైవాన్ పైనే ఉంటుందన్నారు. ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేగింది.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను ఏకి పారేశారు. యుద్దం నుంచి విరమించుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాజాగా ఓ వైపు ఉక్రెయిన్ – రష్యా వార్ కొనసాగుతున్న తరుణంలో తైవాన్ పైనే తమ దండయాత్ర ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇందు కోసం చైనా చీఫ్ జిన్ పింగ్ అత్యంత ఆసక్తికరంగా ఉన్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశాధ్యక్షుడు అత్యంత తెలివైన వ్యక్తి. ఆఫ్గనిస్తాన్ ను అమెరికా ఎలా వెనక్కి తిరిగి వచ్చిందో ఆచరణలో చూశాడు.
ఆ తర్వాత అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఇక చైనా ధ్యాసంతా తన కంట్లో నలుసుగా మారిన తైవాన్ పై ఉంటుందని స్పష్టం చేశాడు డొనాల్డ్ ట్రంప్.(Trump)
అయితే తైవాన్ విషయంలో చైనా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరించారు జిన్ పింగ్ ను. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అమెరికా ఇతర దేశాల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. తమ నాయకులను ఇతర దేశాల నేతలు పూర్తిగా అసమర్థులుగా చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ట్రంప్.