TS BJP : గ్యాంగ్ రేప్ పై సీబీఐ విచారణ జరిపించాలి
వాడిన కార్లు టీఆర్ఎస్, ఎంఐఎం నేతల బంధువులవి
TS BJP : మైనర్ బాలిక అత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు నిందితుల్ని గుర్తించామని, ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ. కానీ భారతీయ జనతా పార్టీ(TS BJP) మాత్రం అసలైన దోషుల్ని పక్కన పెట్టారని ఆరోపిస్తోంది.
ఇక ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజయ్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా సరే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు రఘునందన్ రావు. మే 28న జూబ్లీహిల్స్ పబ్ లో హోం మంత్రి మనుమడు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడని తెలిపారు.
ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ తనయుడు, ప్రముఖ హిందీ పత్రిక యజమాని కుమారుల ప్రమేయం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కాగా డీసీపీ మాత్రం బీజేపీ(TS BJP) చేసిన ఆరోపణల్ని కొట్టి పారేశారు. అదంతా అవాస్తవమని, ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రముఖుల పేర్లు చెప్పి వారిని బయటకు లాగితే వారి కుటుంబాలు ఇబ్బంది పడుతాయని సూచించారు.
ఆధారాలు లేకుండా మాట్లాడ కూడదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు డీసీపీ. ఇదిలా ఉండగా రఘునందన్ రావు నిప్పులు చెరిగారు.
సీసీటీవీ ఫుటేజీలో ఒక్క సెకను తొలగించినా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ అసలు నిందితుల్ని పక్క దారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితులు