EX MLA Jeevan Reddy : మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి షాక్

రూ. 45 కోట్లు రుణం చెల్లించాల‌ని నోటీస్

EX MLA Jeevan Reddy : ఆర్మూర్ – నిన్న‌టి దాకా అధికారం ఉంది క‌దా అని ఎగిరెగిరి ప‌డిన‌, అవినీతి, అక్ర‌మాల‌కు, దాడుల‌కు తెగ బ‌డిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. నిన్న‌టికి నిన్న ఆర్టీసీ ప్రాంగ‌ణంలో నిర్మించిన మాల్ కు సంబంధించి బ‌కాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో కొంత మొత్తం చెల్లించిన‌ట్లు స్వ‌యంగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు.

EX MLA Jeevan Reddy Comment

ఇదిలా ఉండ‌గానే మ‌నోడు త‌న భార్య ర‌జితా రెడ్డి పేరుతో రాష్ట్ర ఆర్థిక సంస్థ నుంచి రూ. 20 కోట్ల రుణం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి వ‌డ్డీలతో క‌లిపి మొత్తం రూ. 45 కోట్లు చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవ‌న్ రెడ్డి(Jeevan Reddy) ఇంటికి వెళ్లి నోటీసులు అతికించారు.

ఆరేళ్లుగా వ‌డ్డీని, అస‌లును క‌ట్ట‌క పోవ‌డంతో ఆ మొత్తం అప్పు,, వ‌డ్డీ క‌లుపుకుని రూ. 45 కోట్ల మేర చెల్లించాల‌ని రాష్ట్ర ఆర్థిక సంస్థ స్ప‌ష్టం చేసింది. గ‌త ఆరేళ్లుగా క‌ట్ట‌కుండా వ‌దిలి వేశాడంటూ ఆరోపించింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేద‌ని, కేవ‌లం ఎమ్మ‌ల్యే ప‌ద‌విని అడ్డం పెట్టుకుని దందాలు, దౌర్జ‌న్యాలకు పాల్ప‌డిన‌ట్లు స్థానికులు మండి ప‌డుతున్నారు.

మ‌రో వైపు విద్యుత్ సంస్థ‌కు రూ. 2 కోట్ల‌కు పైగా బ‌కాయిలు ఉండ‌గా ఆర్టీసీలోని మాల్ కు రూ. 7.25 కోట్లు దాకా బ‌కాయిలు ఉన్న‌ట్లు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Also Read : Anjani Kumar DGP : అంజ‌నీ కుమార్ కు ఈసీ ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!