TS Govt Jobs : 1,433 పోస్టులకు ఆర్థిక శాఖ క్లియర్
మున్సిపల్..పంచాయతీరాజ్, ఆర్డీలలో భర్తీ
TS Govt Jobs : తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే గ్రూప్ -1 పోస్టులతో పాటు పోలీస్ , రవాణా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
తాజాగా మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు లైన్ క్లియర్ ఇచ్చింది ఆర్థిక శాఖ. ఈ రెండు శాఖల్లో కలిపి 1,433 పోస్టులను(TS Govt Jobs) భర్తీ చేయనున్నారు.
ఇందులో వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆయా శాఖల వారీగా చూస్తే పురపాలక శాఖ హెడ్ ఆఫీస్ లో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్ ( ప్రజారోగ్యం ) లో 236, చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ జనరల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
త్వరలోనే ఆయా పోస్టులకు సంబంధించి శాఖల వారీగా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటి దాకా కేవలం 35, 220 పోస్టులు మాత్రమే భర్తీ చేసింది.
ఇంకా మిగిలిన వాటి భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 91 వేల 142 పోస్టులలో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వారిని క్రమబద్దీకరణ చేయగా మిగిలిన వాటిని భర్తీ చేస్తామని ప్రకటించారు సీఎం.
ఇదిలా ఉండగా ఇప్పటి దాకా గ్రూప్ -1 కింద 503 , ట్రాన్స్ పోర్టు, ఫారెస్ట్ , ఎక్సైజ్ , బ్రేవరేజస్ కార్పొరేషన్, తదితర శాఖల్లో 33 వేల 787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ సర్కార్(TS Govt Jobs) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది.
Also Read : గ్రూప్ -1 దరఖాస్తుల గడువు పెంపు