TS High Court Jobs : హైకోర్టులో 84 కాపీయిస్ట్ పోస్టులు

నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్

నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఇంట‌ర్ అర్హ‌త‌తో కాపీయిస్ట్ పోస్టుల‌కు తాజాగా నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇప్ప‌టికే జూనియ‌ర్ అసిస్టెంట్, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ పోస్టుల‌కు ఇటీవ‌లే ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ప‌ర్మినెంట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో భాగంగా 84 కాపీయిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాల‌తో కూడిన నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. కాపీయిస్ట్ పోస్టుల‌కు అర్హ‌త కేవ‌లం ఇంట‌ర్ మాత్ర‌మే అర్హ‌త‌. ఎవ‌రైనా స‌రే ఈ జాబ్స్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కాగా ఇంట‌ర్ అర్హ‌త‌తో పాటు ఇంగ్లీష్ లో టైప్ రైటింగ్ పాస్ కావాల్సి ఉంటుంది. 45 ప‌దాలు టైప్ చేసే సామ‌ర్థ్యం ఉండాల్సి ఉంటుంది. కాగా ఈ కాపీయిస్ట్ పోస్టుకు ఎలాంటి రాత ప‌రీక్ష ఉండ‌దు. నేరుగా జాబ్ పొందే అవ‌కాశం ఉంది.

ఇక ఈ పోస్టుకు సంబంధించి ఇంట‌ర్ తో పాటు అభ్య‌ర్థుల వ‌య‌సు విధిగా జూన్ 1, 2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని స్పష్టం చేసింది హైకోర్టు. జూన్ 15వ తేదీ ఆఖ‌రి తేదీగా నిర్ణ‌యించింది. జ‌న‌ర‌ల్, బీసీ అభ్య‌ర్థులు రూ. 600 , ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.

Leave A Reply

Your Email Id will not be published!