TS High Court : ఎమ్మెల్యేలు ఉంటేనే ప్ర‌జాస్వామం

స‌స్పెన్ష‌న్ పై హైకోర్టు కీల‌క కామెంట్స్

TS High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని మ‌రిచి పోకూడ‌ద‌ని పేర్కొంది.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, ర‌ఘునంద‌న్ రావు, టి. రాజా సింగ్ ల‌ను తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ముగిసేంత వ‌ర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి స‌స్పెన్ష‌న్ విధించారు.

దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టును(TS High Court) ఆశ్ర‌యించారు. ఇది త‌మ ప‌రిధి లోకి రాద‌ని స్పీక‌ర్ మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాలంటూ పిటిష‌న్ ను కొట్టివేసింది సింగిల్ జ‌డ్జితో కూడిన బెంచ్ . దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించారు బీజేపీ ఎమ్మెల్యేలు.

తాజాగా ఎమ్మెల్యేల సస్పెన్ష‌న్ పై దాఖ‌లైన పిటిష‌న్ పై కోర్టు సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. స‌స్పెండైన వారు స్పీక‌ర్ ముందుకు వెళ్లాల‌ని సూచించింది. స‌భాప‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

అసెంబ్లీకి గౌర‌వ అధ్య‌క్షుడు స్పీక‌ర్ అని, ఆయ‌నే తుది నిర్ణ‌యమ‌ని పేర్కొంది. దీంతో పాటు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ధ‌ర్మాస‌నం. హైకోర్టు ఆదేశాల(TS High Court) ప్ర‌కారం మంగ‌ళ‌వారం అసెంబ్లీ ప్రారంభం అయ్యే లోపు స్పీక‌ర్ వ‌ద్ద‌కు చేరుకోవాల‌ని సూచించింది.

ఈ సంద‌ర్భంగా అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. మ‌న‌ది అస‌లు సిస‌లైన ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని, ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు లేక పోతే అది ప్ర‌జాస్వామ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది.

దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తి వేసే దిశ‌గా ఆలోచించాల‌ని సూచించింది.

Also Read : కేసీఆర్ ఖేల్ ఖ‌తం కాంగ్రెస్ దే అధికారం

Leave A Reply

Your Email Id will not be published!