TS High Court Verdict : డీజీపీ ఎంపికపై హైకోర్టు తీర్పు
అంజనీ ఏపీకా తెలంగాణాకా
TS High Court Verdict : తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది. ప్రస్తుతం ఇంఛార్జ్ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ తో సహా మొత్తం 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఏ కేడర్ కు చెందిన వారనే దానిపై తీర్పు ప్రకటించనుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ పూర్తి నివేదికను సమర్పించింది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి, తెలంగాణకు ఎవరెవరిని కేటాయించాలనే దానిపై పూర్తి నివేదిక సమర్పించింది. ఇదిలా ఉండగా ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిని రిపోర్ట్ ను ఈ పదకొండు మంది ఉన్నతాధికారులు సవాల్ చేశారు. వీరంతా పరిపాలనా ట్రిబ్యునల్ లో అప్పీలు చేసుకున్నారు.
ఇదే సమయంలో వీరి అప్పీల్ మేరకు తెలంగాణలో పని చేసేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి అంటే ఐదు సంవత్సరాల తర్వాత పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారానికి తెర దించనుంది రాష్ట్ర హైకోర్టు.
ఇప్పటికే రాష్ట్రంలో సీనియర్లను కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది హైకోర్టు(TS High Court Verdict). ఏ మాత్రం అప్పీలు చేసుకునేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా ఏపీకి వెళ్లి పోవాలని ఆదేశించింది. ఒకవేళ అలా కాని పక్షంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్ , అమ్రాపాలి, తదితరులు ఉన్నారు.
Also Read : జగన్ పాలనలో కంపెనీలన్నీ జంప్