TS Tirumurti : ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేయడాన్ని మొదటి నుంచీ తాము ఖండిస్తూ వస్తున్నామని యుఎన్ భారత రాయబారి తిరుమూర్తి (TS Tirumurti)మరోసారి స్పష్టం చేశారు.
తాము శాంతిని కోరుతున్నామని, రక్తాన్ని, ఆధిపత్యాన్ని, సరిహద్దు వివాదాలతో కయ్యానికి కాలు దువ్వడం లేదన్నారు. కొన్ని దేశాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని కానీ భారత దేశానికి స్వంత సిద్దాంతం, విదేశాంగ విధానం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత్ కోరుకున్నది ఒక్కటే అన్ని దేశాలు బాగుండాలని. ఓటులో పాల్గొనక పోవడం అంటే రష్యాకు మద్దతు ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు.
తమకు ఏం చేయాలో స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఇంకొకరితో చెప్పించు కోవాల్సిన స్థితిలో, దుస్థితిలో భారత్ లేదన్నారు తిరుమూర్తి(TS Tirumurti). డచ్ రాయబారిని ఉద్దేశించి ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
గ్రేట్ బ్రిటన్ , యునైటెడ్ కింగ్ డమ్ , నెదర్లాండ్స్ రాయబారి చేసిన ట్వీట్ లకు ఆయన ప్రతిస్పందించారు. భారత్ సర్వ సత్తాక స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం.
తాము స్నేహం కోరుకుంటామని ఇదే సమయంలో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరినీ సహించ బోమంటూ పేర్కొన్నారు తిరుమూర్తి(TS Tirumurti).
ఈ ఏడాది జనవరి నుండి ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను ఖండించింది యుఎన్ భద్రతా మండలి. జనరల్ అసెంబ్లీ, మానవ హక్కుల మండలిలో విధాన పరమైన ఓట్లు, ముసాయిదా తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది.
ఇదిలా ఉండగా యుఎన్ ఓటింగ్ లో భారత్ తో పాటు చైనా కూడా దూరంగా ఉంది. అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ తో పాటు యూఈ కంట్రీస్ రష్యాపై ఆంక్షలు విధించాయి.
Also Read : WHO : భారత్ లో 4.7 మిలియన్ల కోవిడ్ మరణాలు